టెంపర్ లాంటి న్యూస్.. తెలుగులో బిగ్ బాస్ గా తారక్

0

టెంపర్ లాంటి న్యూస్.. తెలుగులో బిగ్ బాస్ గా తారక్

టాలీవుడ్ యంగ్ టైగర్ గా వెండితెరను ఏలుతున్న జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెరపై కూడా తన టాలెంట్ ను చూపించనున్నాడు. ప్రస్తుతం జై లవ కుశ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.  హిందీలో చాలా పాపులర్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షోని  మా టివి తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా రూపొందించనుంది. అందుకు  జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఎంపిక చేసింది మా ఛానల్.
JRNTR to host BigBoss TV Show in StarMaa.?
దీంతో ఈ టాపిక్ నందమూరి అభిమానులకు చాలా కిక్ ఇచ్చింది. ఇప్పటికే ఈ షోని హిందీలో సల్మాన్ వ్యాఖ్యాతగా చేస్తుండగా.. తమిళ్ లో కమల్ హాసన్ రీసెంట్ గా ఓకే చేశారు.ఇక తెలుగులో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ షోతో అలరించబోతున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుంది. అయితే ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం  తెలియాల్సి ఉంది.
Share.

Leave A Reply