మహేష్ స్పైడర్ బిజినెస్ మొదలైందా?.. అప్పుడే 150 కోట్లు ఎలా ?

0

మహేష్ స్పైడర్ బిజినెస్ మొదలైందా?.. అప్పుడే 150 కోట్లు ఎలా ?

#Mahesh23 which is titled as SPYDER

మాహేష్ బాబు -మురుగదాస్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం స్పైడర్ . ఈ చిత్రం మొదలు పెట్టి చాలా నెలలు కావొస్తున్నా ఇంతవరకు చిత్ర యూనిట్ టీజర్ ను గాని కథకు సంబందించిన ఏ విషయాన్నీగాని అధికారకింగా రిలీజ్ చేయలేదు. అయినా గాని ఈ మూవీపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే మురుగదాస్ దర్శకత్వంలో వస్తుండడంతో ఈ చిత్రం బిజినెస్ మొదలయిందని తెలుస్తోంది. వివరాల ప్రకారం ఇప్పటికే కొన్ని చోట్ల స్పై డర్ మూవీ భారీ స్థాయిలో అమ్ముడుపోయిందట. ఓవర్సీస్ లో 22 కోట్లకు అమ్ముడుపోగా తెలుగు,తమిళ్ హిందీ భాషల శాటిలైట్ రైట్స్ 25 కోట్ల వరకు బిజినెస్ చేయనుందట. దాదాపు ప్రతి చోట 30 కోట్లలో బిసినెస్ చేయగా  ముఖ్యంగా  నెల్లూరు రైట్స్ 35 కోట్లకు పైగా అమ్ముడుపోయిందని, ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. 130 కోట్లతో తెరకెక్కిన  ఈ చిత్రం విడుదలకు ముందే ఇప్పటివరకు మొత్తంగా 150 కోట్ల బిజినెస్ చేసిందని, ఇక రిలీజ్ తర్వాత కూడా మరిన్నిరికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని  సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలను చూస్తుంటే మహేష్ శ్రీమంతుడికి మించిన హిట్ కొట్టగలడని అనిపిస్తుంది అంటున్నారు ఆయన అభిమానులు.  

Share.

Leave A Reply