పవన్ జనసేనకు ఆ 7 స్టార్స్ నిజంగా సపోర్ట్ చేస్తున్నారా..?

0

పవన్ జనసేనకు ఆ 7 స్టార్స్ నిజంగా సపోర్ట్ చేస్తున్నారా..?

Are these seven stars really supporting Pawan Janasena?

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఎదో ఒక న్యూస్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది.ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే వార్తలకు హద్దే లేదు.

అయితే రీసెంట్ గా మరో వార్త పవన్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో  జనసేన పార్టీలో కొంతమంది ప్రముఖులు చేరబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ లో కొంత మంది హీరోలు పవన్ అభిమానులే కావున వారి అభిమానుల సపోర్ట్ పవన్ కి అందేలా చేయనున్నారట. ఇందులో ప్రధానంగా వినిపించే పెరు నితిన్. ఇప్పటికే నితిన్ నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ గారికే సపోర్ట్ అని చెప్పేశాడు.

 Are these seven stars really supporting Pawan Janasena?
అలాగే మరి కొంతమంది కమెడియన్స్ కూడా పవన్ తో కలవనున్నారని విశ్వసనీయ వర్గల సమాచారం. అందులో మొదటగా సప్తగిరి పెరు బాగా వినిపిస్తోంది. ఎందుకంటే తను హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ మూవీ ఆడియో రిలీజ్ కి పవన్ ని  ప్రత్యేకంగా పిలిచి పవర్ స్టార్ అభిమానుల మన్ననలను పొందాడు. దీంతో తనవంతు సాయంగా సప్తగిరి పవన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ముందుగానే చెప్పేశాడు.

JRNTR to host BigBoss TV Show in StarMaa.?

 

అలాగే సునీల్ కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవనున్నాడని తెలుస్తోంది. అంతే కాకుండా భీమవరం నుండి సునీల్ ఎన్నికల బరిలో డిగానున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ కూడా అక్కడ చాలా ఫెమాస్. దీంతో పవన్ కి ఎలాగో త్రివిక్రమ్ క్లోజ్  కాబట్టి భీమవరం మొత్తం ఆ ఇద్దరు కలిసి జనసేనకు ప్రచార కర్తలుగా వ్యవహరించనున్నారట. ఇక బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పవన్ అంటే ప్రాణమైన ఇస్తానంటాడు.

sai-dharam-tej

ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే. అన్నయ్య నాగబాబు తన వంతు సహాయాన్ని అందిస్తానని ఓ ఇంటర్వ్యూ లో గట్టిగా చెప్పేశాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ పై ఎంత ప్రేమ ఉందొ తిక్క ఆడియో రిలీజ్ లో చెప్తాను బ్రదర్ అని   చెప్పేశాడు. ఇక చాలా మంది దర్శకులు,నటులు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పై స్థాయికి చేరితే బావుంటుందని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు.

Pawankalyan Bahubali2 Interval Scene
రీసెంట్ గా బాహుబలి రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్ వంటి మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బావుంటుందని చెప్పాడు. ఇలా ఎవరికి తోచినట్టు వారు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇస్తున్నారు. మరి వీరి సపోర్ట్ పవన్ కి ఎంతవరకు ఉపయోగ పడుతుందో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Share.

Leave A Reply