ప్రభాస్ ఫాన్స్ తో సుజిత్ కి టెన్షన్ .. సాహో పోస్టర్స్


ప్రభాస్ ఫాన్స్ తో సుజిత్ కి టెన్షన్ .. సాహో పోస్టర్స్

18119462_1896254550629831_7009411724323713540_n

బాహుబలి హిట్ తో ప్రభాస్ రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు. బాలీవుడ్ సైడ్ నుంచి కూడా ప్రభాస్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.. అయితే రీసెంట్ గా కొంత మంది ఫాన్స్ ప్రభాస్ పై చూపించిన అభిమాననికి ఓ దర్శకుడు షాక్ అయ్యాడట. అలానే కాస్త టెన్షన్ కూడా పడుతున్నాడట. అతను ఎవరో కాదు ప్రభాస్ తో సాహో తీస్తున్న దర్శకుడు సుజిత్. అసలు ప్రభాస్ ఫాన్స్ ఏం చేశారో తెలుసా..
saaho-duo2

JRNTR to host BigBoss TV Show in StarMaa.?

బాహుబలి విడుదలకు ముందు రోజు రిలీజ్ అయిన సాహో టీజర్ ప్రభాస్ స్థాయికి తగ్గట్టుగా తీసిన విషయం తెలిసిందే కానీ. అందులో ప్రభాస్ లుక్ ఉహించుకున్నంతగా లేదని కామెంట్స్ వచ్చాయి. దీంతో కొంత మంది ఫ్యాన్స్ ప్రభాస్ ఇలా ఉంటే బావుంటుందని , కొన్ని ఫోటోలు ఎడిట్ చేసి సాహో మూవీ పోస్టర్స్ అని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. విషయం తెలుసుకున్న సినిమా యూనిట్ షాక్ అయ్యారట. ఎందుకంటే ఆ పోస్టర్స్ లో ప్రభాస్ లుక్స్ దాదాపు సాహో కి సరిపోయేలా ఉన్నాయట. దీంతో సుజిత్ పై బాధ్యత మరింత పెరిగింది అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ ఫాన్స్ సాహో పై ఏ రేంజ్ లో నమ్మకం పెట్టుకున్నారో ఆ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. మరి సుజిత్ ఆ స్థాయిని అందుకుంటాడో లేదో చూడాలి.
46bbbbf9efe9b311fda22a9d9b14d062
loading...

Comment Below

Comments

Leave a Reply

Copyright © 2017 All Latest News · All rights reserved · WordPress Theme designed by Theme Junkie