​  రాజ్ తరుణ్ చాలా డేంజర్.. అప్పుడే 12 కోట్లా ?    

0

  రాజ్ తరుణ్ చాలా డేంజర్.. అప్పుడే 12 కోట్లా ?    

రాజ్ తరుణ్ అదృష్టం ఇప్పుడు మాములుగా లేదు. ఏ క్షణాన టాలీవుడ్ లో అడుగు పెట్టాడో గాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అదే విధంగా నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాడు ఈ కుర్ర హీరో. సాధారణంగా ఎంత పెద్ద హీరో అయినా ఎప్పుడో ఒకప్పుడు భారీ ప్లాప్ ని చూడక తప్పదు కానీ రాజ్ తరుణ్  నటించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచినా  వసూళ్ల రూపంలో  బాగానే రాబట్టాయని  తెలుస్తోంది. దీంతో రాజ్ తరుణ్ ఇప్పుడు నిర్మాతలకి మినిమమ్ గ్యారంటీ హీరోగా మారాడు.

అదే విధంగా కెరీర్ విషయంలో ఏ మాత్రం తొందర పడకుండా మంచి కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాడు. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే ఫస్ట్ కథ నచ్చితేనే ఒకే చేస్తున్నాడట రాజ్ తరుణ్. రీసెంట్ గా కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో హిట్ కొట్టిన  రాజ్ తరుణ్ ఇప్పుడు ‘అందగాడు’ అనే మరో డిఫ్రెంట్ మూవీతో రాబోతున్నాడు. ఈ చిత్రం జూన్ 2 న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉండడంతో విడుదలకు ముందే శాటిలైట్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడు పోయాయట. అయితే ఈ సినిమా బడ్జెట్ మాత్రం 7 కోట్లు. రిలీజ్ కు ముందే నిర్మాతలకు 5 కోట్లు లాభాన్ని తెచ్చిపెట్టిన రాజ్ తరుణ్ స్థాయి చాలా వరకు పెరిగిపోయింది. ఈ సినిమా విడుదలవ్వగానే ఈ హీరో  మారుతి కథ,స్క్రీన్ ప్లే అందించిన ‘రాజు గాడు యమ డేంజర్, అనే  మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.

Share.

Leave A Reply