షూటింగ్ లో అనుష్క పై కోపం తెచ్చుకున్న రాజమౌళి.. కోపం అసలు కథ

0

షూటింగ్ లో అనుష్క పై కోపం తెచ్చుకున్న రాజమౌళి.. కోపం అసలు కథ

ఈ రోజుల్లో సినిమా ఫీల్డ్ లో అతి తక్కువ రోజులు ఉండే వారు హీరోయిన్లే. ఎదో ఒక హిట్ వచ్చినా ఆ తరువాత కొన్ని సినిమాలెకె ఆడియన్స్ కి బొర్ కొట్టేస్తారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం  10 ఏళ్ళైనా అపజయలతో సంబంధం లేకుండా వచ్చిన సినిమాలని చేసుకుంటూ పోతారు. అందులో అదృష్టం తో పాటు వారి కష్టం కూడా చాలానే ఉంటుంది. ఆ విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్వీటీ అనుష్క గురించి. టాలీవుడ్ కి వచ్చి దాదాపు పదిహేనేళ్లు కావొస్తున్నా ఇంకా ఈ అమ్మడి అందం చెక్కు చెదరకుండా అలానే ఉంది.
1369306836-1602
అయితే అనుష్క బాహుబలి సెకండ్ పార్ట్ విషయం లో రాజమౌళి కి ఓసారి కోపం తెప్పించదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది నిజమేనట. బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్ అయిన తర్వాత కొంత గ్యాప్ దొరికినప్పుడు సైజ్ జీరో సినిమాని చేసింది అనుష్క. అయితే ముందుగా రాజమౌళి షూటింగ్ చేసుకోమని చెప్పాడట కానీ లావుగా అయితే బాహుబలి సెకండ్ పార్ట్ కి చాలా కష్టమవుతుందని చెప్పడంతో కొంత వెనుకడుగు వేసిందట అనుష్క. అయితే సైజ్ జీరో దర్శకుడు కె.రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాష్  రాజమౌళి ని ఒప్పించి సినిమాను ఒకే చేయించడట. దీంతో రాజమౌళి కూడా కె.రాఘవేంద్ర రావు తన గురువు కావడంతో ఎదురు చెప్పలేక చేసుకొమ్మని చెప్పాడు. ఇక సినిమా మొదలు పెట్టక అనుష్క ను చూసిన రాజమౌళి షాక్ అయ్యాడట. ఏం కాదులే ఇంకా షూటింగ్ కి ఆరునెలలు ఉంది కదా తగ్గిపోతుంది అనుకున్నారట సినిమా యూనిట్ సభ్యులు. కానీ రాజమౌళి మాత్రం కాస్త కంగారుగానే ఉన్నాడట.ఆ సమయంలో ఇక చేసేది ఏమి లేక తన పనిలో తను మునిగిపోయాడు జక్కన్న.
ssss
ఎట్టకేలకు అనుష్క సైజ్ జిరో సినిమా రిలీజ్ అయ్యింది. ఆమె చేసిన ప్రయోగానికి ప్రముఖుల నుండి ప్రశంసలు కూడా అందాయి. ఇంతలో  బాహుబలి సెకండ్ పార్ట్ షూటింగ్ మరో కొన్ని నెలలు ఉంది అన్నప్పుడు అనుష్క సైజ్ జిరో షేప్ కి రావడానికి తీవ్రంగా శ్రమించింది.
కానీ దేవసేన పాత్రకు అనుష్క అనుకున్నంతగా లావు తగ్గలేదట దీంతో రాజమౌళి తల పట్టుకున్నాడట. ఆమెపై చాలా సీరియస్ అయ్యాడు. ఆ తరువాత చేసేది ఏమి లేక గ్రాఫిక్స్ లో అనుష్క లావును తగ్గించడానికి అష్టకష్టాలు పడ్డారట. ఇలా అనుష్క సైజ్ జిరో సినిమా ఒకే చేసి జక్కన్న కి కొంచెం కంగారు పెట్టిందట. ఏదైతేనేం చివరికి రాజమౌళి పట్టుదలతో బాహుబలి 2 ని అందంగా తెరకెక్కించడంతో మంచి ఆదరణ దక్కింది. దీంతో నేషనల్ లెవెల్ లో పాపులర్ అయ్యింది.
Share.

Leave A Reply