దాసరి చివరి కోరిక నెరవేరలేదుగా ..??

0
Darsakaratna Dasari Narayana Rao Garu
250 చిత్రాల అనుభవం..1983లో 14 సినిమాలకు దర్శకత్వం .. కానీ దాసరి చివరి కోరిక నెరవేరలేదు
 
కన్ను తెరిస్తే జననం -కన్ను మూస్తే మరణం. నడిమధ్యలో నడిచేదంతా నాటకమని ఓ మహాకవి చెప్పిన అర్ధం ప్రతి జీవికి వర్తిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో  కోరికలు,మరెన్నో ఆశలు మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతాయి. మంచి తనంతో నడుచుకుంటే బ్రతికినంత కాలం ప్రతి శ్వాసలో ఆనందాన్ని పొందవచ్చు. సహాయం కోరి వచ్చిన వారికి తనకు తోచిన సహాయాన్ని అందించడంలో ఉన్న ఆనందం మరోటి
ఉండేదేమో. 
 
 
తీరని శోకం 
అటువంటి మంచి గుణం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఒకరు  దాసరి నారాయణ రావు గారు. అటువంటి వంటి వ్యక్తి మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.ఎందరో  ప్రతిభావంతులైన నటులను,దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేసిన దాసరి చివరి క్షణంలో అనారోగ్యంతో చనిపోవడం అయన ఆత్మీయులను షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా మోహన్ బాబు, ఆర్. నారాయణ ముర్తి వంటి వారికి ఆయనే సినీ జీవితాన్ని ప్రసాదించారు.   
 
 
151 సినిమాలకు దర్శకత్వం.. ఒకే ఇయర్ లో  14 సినిమాలు  
 
151 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి 1972లో తన మొదట సినిమా  తాత మనవడు తో మొదలు పెట్టి  2014 లో చివరగా ఎర్రబస్సు సినిమాతో సినీ ప్రస్థానాన్ని ముగించారు.అలాగే  నిర్మాతగా  53 చిత్రాలను నిర్మించారు. 250కి పైగా చిత్రాలకు మాటలు, పాటలు అందించారు. ఒక సినిమాను మొదలు పెడితే దానిని వీలైనంత త్వరగా పూర్తి చేసే వారు. 1982 లో ఆయన నాన్ స్టాప్ గా 14 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. అందులో చాల  చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  ఆ రోజుల్లో వరుస హిట్లతో టాలివుడ్ టాప్ డైరెక్టర్ దాసరి పేరు మారు మ్రోగింది. 
 
Darsakaratna Dasari Narayana Rao Garu
 
కష్టపడి పైకొచ్చిన ధీరుడు 
 
 ఆయన సినిమా ఫీల్డ్ లోకి రాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన విద్యను పూర్తి చేయడానికి దాసరి చాలా ఇబ్బందులు పడ్డారు. స్కూల్ పీజులకు డబ్బు లేకపోతే వండ్రంగి పని చేసి నెలకు ఒక రూపాయిని వేతనంగా పొందేవారు.  చివరికి ఆయన పట్టుదలతో బిఏ వరకు చదివి అందరి మన్నలను పొందాడు.  ఆ తర్వాత రైటర్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా  నిర్మాతగా, పంపిణీదారుడిగా ప్రతి విభాగంలోనూ రాణించారు. తన కష్ట, సుఖాల్లో పాలు పంచుకున్న  అయన సతీమణి దాసరి పద్మ  2011లో మరణించారు. ఇప్పుడు ఆమె సమాధి పక్కనే దాసరి శాశ్వతంగా నిద్రించనున్నూరు. ఆయనకి ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు  
చివరి కోరిక తీరకుండానే.. 
 
అయితే  చనిపోవడానికి ఒక సంవత్సరం కిందట కొన్ని సినిమాలను తెరకెక్కించాలని అనుకున్నారు. ముఖ్యంగా ఒక మహాభారతం లాంటి  పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించి జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఆ తరువుత సినిమాలకు స్వస్తి చెబుతానని ఓ ఇంటర్వ్యూలో దాసరి మనసులోని మాటను చెప్పుకున్నారు.  కానీ అప్పటికే ఆయన ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యారు.. దీంతో తన చివరి కోరికను నెరవేర్చుకోకుండానే దాసరి చివరి శ్వాసను విడిచారు. ఎన్నో ఒడిదుడుకులతో కష్టపడి సినీ దర్శకుడిగా, నటుడిగా, మంచి వ్యక్తిగా  ఇంత గొప్ప పేరును సంపాదించుకున్న దాసరి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 
 
శ్రద్ధాంజలి 
 
జననం ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.. ప్రతిభ జీవితానికి అర్దాన్నిస్తుంది..దాసరి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం…అలాంటి మహానుభావుడి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుందాం.     
Share.

Leave A Reply