ఖాన్ సినిమాను మించిన డీజే.. బాలీవుడ్ కి హెచ్చరిక చేసిన అనలిస్ట్

0
ఖాన్ సినిమాను మించిన డీజే.. బాలీవుడ్ కి హెచ్చరిక చేసిన అనలిస్ట్
Allu Arjun's Career best collections for DuvadaJagannadham movie.! Check out the numbers here
టాలీవుడ్ స్థాయిని ప్రపంచ స్థాయి కి చాటి చెప్పిన బాహుబలి గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే.. ఆ సినిమాతో తెలుగు చిత్రం పరిశ్రమకి మంచి రోజులు దగ్గర పడ్డాయని అనిపిస్తుంది..ఎందుకంటే ఆ సినిమా భారీ హిట్ తో తెలుగు సినిమాలకు విదేశాల్లో భారీ ఆదరణ దక్కుతోంది.. రీసెంట్ గా దువ్వడ జగన్నాథమ్ సినిమాకి ఆ ఫార్ములా చాలా వరకు హెల్ప్ అయ్యింది.
 unnamed
 బన్నీ డీజే సినిమా అక్కడా భారీ హిట్ ను నమోదు చేసుకుంది. ఫస్ట్ డే సాయంత్రం 5 గంటల్లోపే $ 526,355 [రూ3.39 కోట్లు] వసూలు చేసిందని ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు.
అంతే కాకుండా బాలీవుడ్ ఇక టాలీవుడ్ తో పోటీకి సిద్ధంగా ఉండాలి.. జాగ్రత్త.. అని ట్వీట్ చేశాడు. ఎందుకంటే అదే రోజు విడుదలైన సల్మాన్ ట్యూబ్ లైట్ డీజేకి ఏ మాత్రం పోటీని ఇవ్వలేకపోయింది. ఓవర్సీస్ లో మొత్తం 300 స్క్రీన్స్ లో దువ్వడా జగన్నాథమ్ రిలీజ్ అయ్యింది. అంతకంటే ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయిన సల్మాన్ మూవీ మాత్రం $ 500,250 లను మాత్రమే రబట్టగలిగింది.
Share.

Leave A Reply