ప్రేమిస్తే నటుడు బిచ్చగాడిగా ఎలా..? అతని జీవిత సినిమాయ కథ.


ప్రేమిస్తే నటుడు బిచ్చగాడిగా ఎలా..? అతని జీవిత సినిమాయ కథ.

 

ప్రేమిస్తే నటుడు బిచ్చగాడిగా ఎలా..? అతని జీవిత సినిమాయ కథ.

సినిమాల్లో అవకాశల కోసం ఎదురుచూసేవారు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ రోజుల్లో స్టార్స్ గా పేరుపొందిన చాలా మంది నటులు ఒకప్పుడు స్టూడియోల చుట్టూ దర్శకుల చుట్టూ ఒక్క అవకాశం అంటూ… తిరిగినవాళ్లే…ముఖ్యంగా తమిళనాడులో అయితే చాలా మంది సినిమా చాన్సు కోసం దర్శకుల ఇంటి ముందు రెండు మూడు రోజులైనా వెయిట్ చేస్తూ ఉంటారట..

*ప్రేమిస్తే కమెడియన్  బాలు..*

 unnamed (1)

అయితే రీసెంట్ గా వార్తల్లో బాగా వినిపిస్తున్న  అంశం.. తమిళ నటుడు బాలు బిచ్చగాడు అయ్యాడని, ఇది నిజమే అతను తమిళనాడు లోని ఓ గుడి మెట్ల కింద అడుకుంటున్నాడు. ఆకలి కోసం భిక్షాటన చేస్తూ బ్రతికేస్తున్నాడు..

కాదల్(ప్రేమిస్తే) సినిమాలో సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూసే వ్యక్తిగా కనిపించి.. ఒకే ఒక్క సీన్లో చాలా నవ్వించాడు..  అయితే అతని నిజ జీవితంలో కూడా అతని పరిస్థితి అదేనట.. ఇంతకీ అతనికి ఆ సినిమాలో చాన్సు ఎలా వచ్చిందో తెలుసా ?

*రోబో దర్శకుడు శంకర్ ఛాన్స్ ఇచ్చాడు కానీ..*

unnamed (3)

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు.. శంకర్ సినిమా అనౌన్స్ చేస్తే చాలు అతని దగ్గరికి వేళల్లో జూనియర్ ఆర్టిస్టు లు వచ్చి ఒక్క చాన్స్ సర్ అని బ్రతిమలేవరట.. అంతే కాకుండా శంకర్ ఇంటి ముందు ఎంతో మంది రాత్రి పగలు తేడా లేకుండా వెయిట్ చేస్తుంటారు… అయితే ఓ సారి బక్కగా ఉన్న ఓ వ్యక్తి శంకర్ ఇంటి ముందు వారానికి పైగా అలానే ఉన్నాడట.. అక్కడే ఎదో ఒకటి దొరికింది తిని అక్కడే పడుకునే వాడట. అయితే అతన్ని రోజు చూసిన శంకర్ ఓ రోజు పిలిచి ఏం పెరు అని ఆడగ్గానే బాలు అని చెప్పాడట… ని నంబర్ ఇచ్చి వేళ్ళు నేను అవసరం ఉన్నపుడు పిలుస్తానని చెప్పారట శంకర్.

*మొదటి అవకాశం..*

unnamed

శంకర్ తానే నిర్మాతగా మరి తన దగ్గర పని చేసిన బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో ప్రేమిస్తే సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో  హీరో తన స్నేహితుడి దగ్గరకి వెళ్ళినపుడు.. అక్కడ ఆ స్నేహితుడి రూమ్ లో ఓ అసిస్టెంట్ దర్శకుడి కామెడీ ట్రాక్ శంకర్ కి బాగా నచ్చింది.. వెంటనే బాలుని పిలిపించి  తన నిజ జీవితం లోని క్యారెక్టర్ నే ఇచ్చాడు శంకర్.. బాలాజీ శక్తివేల్ ఆ కామెడీ ట్రాక్ ని చాలా సింపుల్ గా తెరకెక్కించి… శంకర్ శభాష్ అనేలా చేశాడు.. సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది.. కానీ అతడికి ఛాన్సులు మాత్రం రాలేవు.. అక్కడా, ఇక్కడ ఎదో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన బాలు డైలాగ్ చెప్పే ఒక్క క్యారెక్టర్ కూడా దక్కలేదు.

*కొన్నాళ్లకె తల్లిదండ్రుల మరణం..మీడియా దగ్గరకు రాగానే..*

unnamed (2)

 అయితే కొన్నేళ్ల క్రితం అతని తల్లిదండ్రులు కూడా మరణించారట.. దీంతో ఏ ఆధారం లేక అతను చివరికి గుడి మెట్ల దగ్గర బిచ్చగాడిలా జీవనం కొనసాగిస్తున్నాడు.. అతని దగ్గరికి ఓ మీడియా ఛానల్ వెళ్ళడానికి ప్రత్నించగా అతను అక్కడి నుండి వెళ్లిపోయాడాని చెన్నైలోని ఓ పత్రికలో రాశారు.. కానీ అతని దగ్గర ఇంకా సినిమా అవకాశాల కోసం తీయించుకున్న ఫోటోలు ఇంకా ఉన్నాయని అతనితో ఉండే ఓ బిచ్చగాడు తెలిపాడు..ప్రస్తుతం బాలు ఒక్కడే కాదు అతనిలా యాక్టర్ అవ్వాలని చెన్నైకి వచ్చిన వాళ్ళు ప్రయత్నాలకు అలసిపోయి.. ఎదో ఒక కూలి పని చేసుకుంటూ గుడిసెలో బ్రతికేస్తున్నారు….

*ఒక్క చాన్స్ అని అందుకే అంటారా..?*

 నిజంగా జీవితం అనే మాయలో మరో మాయ ప్రపంచం సినిమాయలోకం అనే చెప్పాలి..ఎందుకంటే నిజ జీవితంలో మనిషికి డబ్బు ఉన్నపుడు ఒక క్యారెక్టర్ ని డబ్బు లేనపుడు ఒక క్యారెక్టర్ ని ఇస్తుంది..

అదే సినిమా జీవితంలో 1% లక్ లేకున్నా హోదా అనే మాయ ఎప్పుడు వేక్కిరిస్తూనే ఉంటుంది..

సాధారణ జీవితంలో డబ్బుది అప్పర్ హ్యాండ్ అయితే.. సినీ ఫీల్డ్ లో 99% కష్టం కన్న 1% లక్ దే పై చేయి… ఒక్క చాన్స్ అందుకే అంటారేమో..?

loading...

Comment Below

Comments

Leave a Reply

Copyright © 1515 All Latest News · All rights reserved · WordPress Theme designed by Theme Junkie