పవన్,రజినీ నోట్ల కట్టలు పంచకుండా గెలవగలరా..?

0

పవన్,రజినీ నోట్ల కట్టలు పంచకుండా గెలవగలరా..?

రాజకీయాలు.. మనుషులకంటే అధికారనికే ఇక్కడ విలువ. ఆ విలువ దక్కాలంటే ఈ రోజుల్లో డబ్బు ఉండాల్సిందేన?.

పాలిటిక్స్ లోకి మంచి చేయాలని వచ్చినా ఆ పని వెనుక కొన్ని కుట్రలు చేయక తప్పదా?.. 

ప్రస్తుతం రాజకీయాల్లో ఉండాలంటే మంచికి, చెడుకి సపోర్ట్ చేసే గుణం ఉండాల్సిందేనా?.. 

ప్రతి ఎలక్షన్స్ లో నోట్ల కట్టలు పంచాల్సిందేనా?..

మోసాలు చేయకుంటే ..?

అవును గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇలానే ఉందేమో అనిపిస్తుంది. నాయకులో చదువుకున్న వారి కంటే హత్యలు, కుట్రలు, కుంభ కోణాలు చేసిన వాళ్లే ఎక్కువ ఉన్నారు.. కానీ ఆ పరిస్థితుల్లో అలా చేయకుంటే వారికి ఆ అధికారం ఉండేది కాదేమో..లేకుంటే రాత్రికి రాత్రి హోటల్ లో రూమ్ బుక్ చేసి ఎమ్మెల్యే లతో మీటింగ్ పెట్టి ప్రధాని పదవిని అయినా ఉడగొట్టిన సందర్భాలు ఎన్నో.. మరి అలాంటి రాజకీయాల్లో ఎంత అనుభవం ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 

 ఎంత డబ్భు పంచామన్నదే ముఖ్యం..

మంచి చేయడం కన్నా ఇక్కడ కుట్రలతో కూడిన వ్యూహాలే ఎక్కువని చాలా మంది అంటుంటారు.. ప్రజలకు ఎంత మంచి చేశామన్నది కాదు. పదవి చివర్లో ఎన్నికల ఆరంభంలో ఎంత డబ్బు పంచావన్నదే ముఖ్యం. ఎందుకంటే కొందరు నేతలు పదవిలో ఉన్నపుడు కొన్ని మంచి పనులు చేసినా .. ఎన్నికల్లో డబ్బు పంచిన పార్టీలకే ఓట్లు గుద్దిన సందర్భాలు ఎన్నో…. దీంతో

నేతల మదిలో ఒక్క ఆలోచన బలంగా పాతుకు పోయింది. అదే “ఎంత చేశామన్నది కాదు ఎంత డబ్బు పంచమన్నదే ముఖ్యం”. 

ఫాన్స్ ఒకే…బట్ ఓట్స్ ?

పోనీ పోరాటాలు చేసి ప్రజల్లో స్థానం సంపాదించుకోగలమ అంటే.. ఆ పద్దతి ఈ రోజుల్లో లేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఈ పద్దతి అలానే ఉంది. చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేసినా.. పైకి ఇలాంటి వాడు రాజకీయాల్లోకి రావాలి అంటారు..కానీ వారిలో కనీసం ఓటును వినియోగించుకునే వారు ఎంత మంది?.

ఇలాంటి రాజకీయాల్లో రజినీకాంత్, పవన్ కళ్యాణ్ లాంటి వారు నాయకులు  అవ్వగలరా.. కొన్నిటిని దక్కించుకోవాలంటే కొన్ని వదులుకోక తప్పదు. మంచి చేయాలి. కానీ దాని వెనుక ఓ తప్పును కూడా చెయ్యాలి.. బయట ప్రపంచానికి మంచి మనుషులుగా గుర్తింపు ఉన్న ఆ స్టార్స్ ఆ తప్పటడుగులు వేస్తారా?.. అభిమానులన్నారు కానీ వారి ప్రేమను ఓటు వరకు తీసుకెలేతరా?. ఇంతకు ముందు ఉన్న స్టార్స్ కూడా ఆ అడుగు వేయక తప్పదని వేసి గెలిచారు.. మరి రజినీకాంత్, పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి చేయాలంటే ఏ దారిని ఎంచుకుంటారో చూడాలి.

 

Share.

Leave A Reply